Apara Karyakramalu

  • Home
  • Pooja Services
Apara Karyakramalu-Contact: 9292559918

మీ ఇంటివద్ద ఆబ్ది కము పెట్టుటకు వీలుకాని పరిస్థితులలో మమ్ము సంప్రదించిన పురోహితుల గృహము నందు కార్యక్రమమును ఏర్పాటు చేయ గలము .


జీవుడు మరణించిన తరువాత దహన సంస్కారములు , నిత్యకర్మ , దశాహం , షోడసము , మరియు సపిండీ కరణ కార్యక్రమము వరకు తప్పకుండా విధిగా చేయవలెను 12 వ రోజు సపిండీ కరణ కార్యక్రమముతో యజమానికి అసౌచము (మైల) తొలగి పోతుంది . నిత్యకర్మ చేయలేని వారు 9 వరోజు నుంచి కార్యక్రమము ప్రారంభము చేసికొన వచ్చును. సంచయన కార్యక్రమము దహనము ఐన మరుసటి రోజున చేయవలెను . ధనిష్ఠ పంచకములు దుష్ట తిధి మొదలగు రోజులలో మరణించినట్లైతే 13 వ రోజు ఉదక శాంతి కార్యక్రమము విధిగా చేయవలెను . యజమానికి (కర్తకు ) నియమ నిబంధనలు.
1. ప్రతిరోజూ ఇంటినందు పడుకో పెట్టిన చోట శుభ్రము చేసి దీపారాధన చేయవలెను.
2. యజమాని (కర్త) భోజనమును మడి వస్త్రము మీదనే భోజనము చేయవలెను.
3.భోజనము చేసే ముందు తప్పనిసరిగా వాయస పిండమును అనగా భోజనము చేసే విస్తరి నుంచి కొద్దిగా తెల్ల అన్నము తీసికొని అందులో నల్ల నువ్వులు కలిపి కాకి " కి " పెట్టి కర్త భోజనము చేయవలెను .
4. రాత్రి పూట అల్పాహారము (టిఫిన్ ) మాత్రమే చేయవలెను .
5.. బైట పదార్ధములు భుజింప కూడదు .
6. రాత్రికి కింద పదుకొనె వలెను . బ్రహ్మ చర్యము పాటించ వలెను.
7 ప్రతినెలా విధిగా చనిపోయిన తిధి రోజున మాసికము విధిగా నిర్వహించ వలెను ఏదైనా మాసికములు నిర్వహిచటకు వేలు కాక పొతే మరుసటి నెలలో ఇంకొక భోక్తను పెట్ట వలెను . దీనిని అతిపన్నము అంటారు .


ఈ విధముగా 12 రోజుల చాలా శ్రద్ధగా కార్యక్రమమును నిర్వహించ వలసి ఉంటుంది ఆలా చేసినట్లయితే పోయిన వారి ఆత్మ కు శాంతి కలిగి వాళ్ళ దీవెనలు , మరియు వంశం అభివృద్ధి చేస్తారని ధర్మ శాస్త్రంలో చెప్ప బడినది.