నైమిశారణ్యం ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో లక్నోకు 94కి.మీ. దూరంలో ఉంది. గోమతినది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం వేలాది సాధు సన్యాసులు తపమాచరించే పవిత్ర ప్రదేశం. వేదవ్యాసుడు నైమిశారణ్యంలోనే మహాభారతాన్ని రచించినట్టు తెలుస్తోంది. మహా భారతం, రామాయణం, వాయుపురాణం, వరాహపురాణాల్లో నైమిశారణ్య ప్రస్తావన ఉంది. వేదవ్యాసుడు వేదాలను, అన్ని పురాణాలను తన శిష్యులకు బోధించిన పరమ పావన ప్రదేశం నైమిశారణ్యం.
భూమి పూజ అనేది దేవత మరియు వాస్తు పురుషుడు(దిశల దేవత) గౌరవార్థం చేసే కర్మ. భూమి అంటే తల్లితో సమానం .ఈ పూజ చేయడం వల్ల భూమిలోని చెడు ప్రభావాలు మరియు వాస్తు దోషాలు తొలగిపోయి, ఏ నిర్మాణానికి మార్గం సుగమం అవుతుందని చాలా మంది నమ్ముతారు.భూమి పూజ సందర్భంగా ఎవరెవరిని ఆరాధిస్తారంటే.. వాస్తు దేవుడిని, భూమి తల్లిని, పంచ భూతాలను వాస్తు శాస్త్ర మార్గదర్శకాలను అనుసరించి పూజిస్తారు. ఈ భూమి పూజను కుటుంబ పెద్దలు చేయాలి. తల్లిని గౌరవించే ఈ కర్మను పండితుల సమక్షంలో చేయాలి. అనుభవం ఉన్న పండితులో ముందుగా ఓ మంచి ముహుర్తాన్ని నిర్ణయించుకుని.. అతని పర్యవేక్షణలో ఈ పూజను చేయాలి.మరోవైపు శని, ఆదివారం, మంగళవారం నాడు ఎట్టి పరిస్థితుల్లో భూమి పూజలు చేయకూడదు. ఇంట్లో ఎవరైన మహిళలు ఏడు నెలలకు పైగా గర్భవతిగా ఉన్న సమయంలో నిర్మాణ పనులను ప్రారంభించకూడదు.
గృహప్రవేశం లో ముందుగా మనము నిర్ణయిమ్చుకొన్న సమయమునకు 5 నిముషముల ముందు మంచి గుమ్మడి కాయము , కొబ్బరికాయను మెయిన్ ఎంట్రన్స్ నందు మంత్రములతో దిష్టి తీసి అనుకున్న సమయమునకు గృగములోనికి ప్రవేశించాలి తరువాత గణపతి పూజ , పుణ్యావచన ము , పాలు పొంగించటం , వాస్తు , నవగ్రహ మండపారాధన, వాస్తు , గణపతి హోమము, తప్పకుండ చేసికోవాలి . సత్యనారాయణ స్వామి వ్రతం , వాస్తు కళ్యాణం వసతి కొద్దీ చేసికొన వచ్చును . ఇలా గృహప్రవేశం చేయకుండా ఎవరూ ఇంట్లో చేరేవారు కాదు. ఇవన్ని కూడా ఇంట్లో జీవశక్తిని పెంపొందించి, అందులో నివసించేవారి పురోభివృద్ధికోసమే. గృహప్రవేశమంటే 'మీరు' అనే ఈ మొక్క బాగా పెరిగి, పండ్లూ, పూలూ ఇచ్చేందుకు అవసరమైన సారవంతమైన నేలను సమకూర్చుకోవటం లాంటిది. దురదృష్టవశాత్తూ వీటిని నిర్వహించేవారు అసలు వీటిని ఎందుకు చేస్తున్నారో గ్రహించి, దాని ప్రకారం వీటిని నిర్వహించే బదులు, ఏదో మొక్కుబడిగా నిర్వహించేసి ఈ గృహప్రవేశమనే ప్రక్రియను నామమాత్రంగా జరిపిస్తున్నారు. అందుకే ప్రజలు ఇటువంటి పద్ధతులను వదిలేస్తున్నారు. ఈ కాలంలో క్రొత్త ఇంట్లోకి చేరటమంటే ఒక విందు ఇవ్వటం, అందులో యదేశ్చగా మితిమీరి తినటం, త్రాగటం అవుతుంది. ఇలాంటి కారణాలచేత పురోభివృద్ధి చెందటం లేదు.భారతీయ జీవన విధానం అనేది ఎంతో ఉన్నతమైనది.పాశ్చత్య సంస్కృతి మోజులో ప్రస్తుత సమాజం ఆచార వ్యవహారాలను పాటించడంలేదు.
ప్రతి ఒక్కరు వారివారి ఇంటివద్ద పూజ సంబంధ కార్యక్రమములు ఎందుకంటె మన ఇల్లు ఒక దేవాలయముగా భావించాలి దేవాలయములు పవిత్రతకు ప్రతీక . అక్కడ ప్రతినిత్యము మంత్ర ఉచ్ఛరణతో ఆ ప్రదేశము అంతా పవితమవుతుంది . అందువలన మనము దేవాలయమునకు వెళ్ళినప్పుడు మన కు తెలియకుండానే ఒకరకమైన అనుభూతి కలుగుతుంది మనము దేవాలయములో ఉన్న కొంచము సమయమైనా మనసు లోఉన్న ప్రతికూల శక్తి (Negative Energy) వెళ్లి సానుకూల శక్తీ (positive enegery ) వస్తుంది . మన ఇంట్లో కూడా ప్రతికూల శక్తి (Negative Energy) వెళ్లి సానుకూల శక్తీ (positive enegery) రావాలనంటే కనీసం సంవత్సరంలో ఒకసారి అయినా అభిషేకం , వ్రతము , నోములు మొదలనవి చేసికొన్న మన ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి (Negative Energy) వెళ్లి సానుకూల శక్తీ (positive enegery) వస్తుంది
కందిపప్పు , చింతపండు , బెల్లం , బియ్యం , పోపు దినుసులు , పల్లీలు , గోధుమ పిండి , శనగ పిండి , నూనె ,నేయి , సగ్గుబియ్యం /సేమ్యా,పెరుగు , కూరలు : గడ్డ కూరలు 2 రకములు , కాయ కూరలు 2 రకములు ఆకుకూర 1 రకం , నిమ్మకాయలు , అల్లం, కొత్తిమీర , కరివేపాకు , మొదలగునవి, యివన్నీ కలిపితె స్వయంపాకం అవుతుంది
సృష్టి కర్త బ్రహ్మ శరీరంలో నేరుగా పుట్టిన బిడ్డ చిత్రగుప్తుడు. గరుడ పురాణంలో లిఖితపూర్వ కంగా ఆయన ప్రస్తావన ఉంది. బ్రహ్మ 11వేల సంవత్సరాలు ధాన్య ముద్రలోకి వెళ్లాడు. ధ్యానముద్రలో ఉన్న బ్రహ్మ కళ్లు తెరిచి చూసేసరికి ఆజానుబాహుడు కనిపిస్తాడు. చేతిలో పుస్తకం, పెన్ను, నడుం భాగంలో కత్తి కనిపిస్తుంది. అపుడు బ్రహ్మ పురుషా నీవు ఎవరివి. ఎచటి నుండి వచ్చావు అని అడిగాడు. అపుడు ఆ పురుషుడు మీ చిత్ర్ (శరీరం)లో గుప్త్(రహస్యం)గా నివాస మున్నాను. ఇపుడు నాకు నామకరణం చేయండి, నా కార్యకలాపాలు ఏమిటో చెప్పండి అని ప్రాధేయపడతాడు. అపుడు బ్రహ్మ ఈ విధంగా అన్నారు. ” నీవు నా శరీరంలో రహస్యంగా తలదాచుకున్నావు కాబట్టి నీ పేరు చిత్రగుప్త. అదే పేరుతో వెలుగొందుతావు. అంతే కాదు జీవుల శరీరాల్లో తలదాచుకుని వారి మంచి చెడుల గూర్చి తెలుసుకుని పాపాత్ములకు శిక్షలు పడే విధంగా కృషి చేయి” అని ఆశీర్వదిస్తాడు బ్రహ్మ.వేదాలలో కూడా చిత్రగుప్తుడి గూర్చి ఉంది. ఉత్తర భారతీయులు చేసే చిత్రగుప్తుడి పూజలో పెన్ను, పేపరు, ఇంక్, తేనె, వక్క పొడి, అగ్గిపెట్టె, చెక్కెర, గంధం చెక్క, ఆవాలు, నువ్వులు, తమలపాకులు ఉంటాయి. దక్షిణ భారతీయులు చేసే చిత్రగుప్తుడి పూజలో ఎద్దు తొక్కని వడ్లు, ఎర్ర గుమ్మడి పండు, కట్లు లేని గంప మొదలైన విశేష ద్రవ్యాలు ఉంటాయి. న్యాయం, శాంతి, అక్షరరాస్యత, విజ్ఞానం ఈ నాలుగు గుణాలు పొందడానికి చిత్ర గుప్తుడి పూజా సామాగ్రిలో ఉంటాయి. అకాలమృత్యువును జయించొచ్చు వాన రాకడ ప్రాణం పోకడ తెలియదంటారు పెద్దలు. వాన వచ్చే విషయాన్ని అయినా కొంతవరకు చెప్పవచ్చుగానీ ప్రాణం పోకడ గూర్చి ఎవరూ చెప్పజాలరు
మెదటి సారి మాఘ సప్తమినాడు లేదా మహా శివరాత్రి నాడు ప్రారంభించవలెను. ప్రతి సంక్రమణమునాడు పూజించ వలెను. చివరికి మకరసంక్రమణము నాడు ఉద్యాపన చేసుకున్నచో బాగుండును. మొదటి నెలనే కానీ, మధ్యలో కానీ చివరన కానీ ఎవరి వీలును బట్టి వారు ఉద్యాపన చేసుకొనవచ్చును. బంగారు ప్రతిమలు, సువర్ణాలంకృతమైన గోదానం, వస్త్రదానాదులు, దశదానాలు, షోడశ మహాదానాలు, 30 మంది బ్రాహ్మణులకు భొజనం అంటే భారీఖర్చుకదా మరి పేదవారి సంగతి ఏమిటి? అని సందేహ పడనవసరం లేదు. ఎవరి వైభవాన్ని అనుసరించి వారు చేయవచ్చును. కానీ శక్తి ఉండికూడా లోభగుణముతో చేయవలసినవి చేయకుండ ఉండరాదు. ఆర్థిక స్థితి కలిగిన వారు యథావిధిగా చేయవలసినదే! శక్తిలేనివారు ఆర్తితో పరమేశ్వరునికి తమ స్థితి తెలుపుకుని పురోహితుల సూచన మేరకు నడుచుకొనవలెను. దానం అన్నదమ్ములకు, గ్రామ కరణానికి ఇవ్వాలా? అనగా.. నిజానికి కల్పములో అలా లేదు. గృహస్థుడైన బ్రాహ్మణునకు దానమిమ్మని తెలిపిరి కనుక ఆవిధంగానే జేయవలెను. ప్రతినిత్యమూ భుజించు అన్నమును ముందుగా “చిత్రాయనమః, చిత్రగుప్తాయనమః, యమాయ నమః” అనుచూ మూడు బలులను సమర్పించుట వలన చిత్రగుప్తుడు,యముడు ప్రీతి చెందుదురు. ఉపనయనమైన వారు ఔపోసనుము చేసినప్పుడు ఈవిధముగా విస్తరాకు ప్రక్కన మూడుసార్లు అన్నమును పెట్టుట నేటికీ కలదు
ఉద్యాపన: ఏడాదిపాటు నిత్యం పై కథను చెప్పుకుని అక్షింతలు శిరస్సుపై వేసుకోవలెను. అనంతరం ఉద్యాపన చేసుకోవలెను. ఎడ్లు తొక్కని వడ్లు అయిదు కుంచములు కట్లు లేని గంపలో పొయ్యవలెను. ఆ వాడలలో గుమ్మడి పండును వుంచవలెను. అడ్డెడు తవ్వాడు (2-1/2) బియ్యము ఆకుకూరలు, పట్టు పంచె ఆ గంపలో పెట్టి వెండి ఆకు, బంగారు గంటము దక్షిణ తాబూలములతో అన్న గారికి ఇవ్వవలెను.
సూత సంహిత అను గ్రంధములో 18 వ ప్రకరణము నందు దీని ప్రస్తావన ఉంది కానీ వేద ప్రమాణము లేదు సూత సంహిత అను గ్రంధము ఆధారముగా పంచాంగ కర్తలు శరీరము పై బల్లి పడిన అవయవమును బట్టి ఫలితమును నిర్ణయిమ్చటం (రాయటం) జరిగింది ఖచ్చితమైన ప్రమాణము లేదు .
ద్వాదశ జ్యోతిర్లింగాలు 12. ఈ 12 క్షేత్రములలో పరమశివుడు జ్యోతి రూపములో దర్శనము ఇస్తాడు . ఈ క్షేత్రములలో లలో ఉండే గణపతిని సాక్షి గణపతి అంటారు శివ దర్శనం చేయటానికి వచ్చిన భక్తులకు సాక్షియే ఈ సాక్షి గణపతి , మిగతా శివాలయములలో ఉండే గణపతిని సాక్షి గణపతి అనరు
అష్టాదశ పురాణములు 18 అవి ( మత్య పురాణం , మార్కండేయ పురాణం , భాగవత పురాణం , భవిష్య పురాణం , బ్రహ్మ పురాణం , బ్రహ్మ పురాణం , వైవర్త పురాణం , బ్రహ్మాండ పురాణం , విష్ణు పురాణం , వరాహ పురాణం , వామన పురాణం , వాయు పురాణం , అగ్నిపురాణం , నారద పురాణం , పద్మ పురాణం , లింగ పురాణం , గరుడ పురాణం , కుర్మా పురాణం , స్కాంద పురాణం )
50 % Only
ఆషాఢమాసం నుంచి 9 నెలలు తీసికుంటే షుమారు గ పాల్గుణ , చైత్ర మాసములు మంచి ఎండాకాలం వస్తుంది కనుక డెలివరీ సమయములో అనేక యిబ్బదులు వస్తాయని భార్య భర్తలు ఒకేచోట ఉండరాదని ఈ నియమం పెట్టటం జరిగింది
1 గర్భాదానం 2 పుంసవనం 3 సీమంతం 4 జాతకర్మ 5 నామకరణం 6 నిష్క్రమణ 7 అన్నప్రాశన 8 చూడాకరణ 9 కర్ణవేధ 10 అక్షరాభ్యాసం 11 ఉపనయనం 12 వేదారంభం 13 కేశాంత 14 సమావర్తన 15 వివాహం 16 అంత్యేష్టి
ఈ గరుడపురాణం లో ప్రేత కల్పము ఉండటం వలన కొందరికి సందేహము కలుగుతుంది . యిది భగవ దుక్తం , వ్యాస విరచితం , యితర పురాణముల లాగానే దీనిని కూడా ఇంట్లో ఉంచవచ్చును
మహా శివరాత్రి పర్వదినాన అర్ధరాత్రి లింగోద్భవ కాల పూజ పరమ శివుడిని కొలిచేందుకు అత్యంత అనుకూలమైన సమయం. ఈ లింగోద్భవం గురించి స్కంద పురాణంలో వివరించడం జరిగింది. మహా ప్రళయం తరువాత, సృష్టి, స్థితి కారకులైన బ్రహ్మ, విష్ణువు మధ్య ఎవరు గొప్పో తేల్చుకోవాలన్న పోటీ వచ్చి, అది సంగ్రామానికి దారి తీసింది. ఒకరిపై ఒకరు భీకర ఆస్త్రాలను ప్రయోగించుకునే వేళ, మరో ప్రళయాన్ని నివారించేందుకు లయ కారకుడు రంగంలోకి దిగి, ఆద్యంతాలు తెలియని మహాగ్ని స్తంభం రూపంలో అవతరించి దర్శనమిచ్చాడు. ఇది జరిగింది మాఘ బహుళ చతుర్దశి నాటి అర్థరాత్రి. ఇదే లింగోద్భవ కాలం. ఇక ఈ శివ లింగావతారం మొదలును తెలుసుకునేందుకు విష్ణువు వరాహ రూపంలో, ముగింపును చూసేందుకు బ్రహ్మ హంస రూపంలో వెళ్లి, తమ లక్ష్యాన్ని చేరలేక తిరిగి వచ్చి శివుడినే శరణు కోరగా, తన నిజరూపంతో వారికి దర్శనమిచ్చి వారిలో నెలకొన్న అహంకారాన్ని రూపుమాపాడు. శివుడు తొలిసారిగా లింగ రూపంలో దర్శనమిచ్చిన సమయం కాబట్టి లింగోద్భవ కాలం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. అందుకే, రాత్రి 11 గంటల వేళ మొదలయ్యే లింగోద్భవ కాల పూజలను భక్తులు అత్యంత శ్రద్ధతో నిర్వహించి పరమశివుడి కృపకు పాత్రులవుతుంటారు.
1 కారణ జన్మ సంతానము ఉదా : రామకృష్ణ పరమహంస, వివేకానంద , ఆదిశంకరాచార్య 2 కామ జన్మ సంతానము , 3 ,కర్మ జన్మ సంతానము
తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం - ఈ ఐదు భాగముల కలయికే పంచాంగం ("పంచ"-"అంగం"). పంచాంగం దుర్ముహూర్తములు, శుభముహూర్తములు తెలుపుతుంది. పంచాంగములు రెండు రకములు. చాంద్రమాన పంచాంగం (చంద్రుని సంచరణతో అనుసంధానమైనది), సూర్యమాన పంచాంగం (సూర్యుని సంచరణతో అనుసంధానమైనది)
జ్యోతిష్య శాస్త్రం రెండు రకాల మౌఢ్యమిల గురించి చెబుతోంది. ఒకటి శుక్ర మౌఢ్యమి, మరొకటి గురు మౌఢ్యమి. సెప్టెంబర్ మాసం 15 వ తేదీనుండి డిసెంబర్ 2 వ తేదీ వరకు అనగా 79 రోజులపాటు శుక్ర మౌఢ్యమి ఉంటుంది. మౌఢ్యమినే వాడుక భాషలో మూడం అంటారు. నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమిపై ఉన్నవారికి కనపడదు. దీన్నే అస్తంగత్వం లేదా మూడం అంటారు. గ్రహాలకు రాజు సూర్యుడు అంటే సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆగ్రహం తన శక్తిని కోల్పోతుంది, అలా గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురు మౌఢ్యం, శుక్రడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యం వస్తుంటాయి. ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతాయి. అందుకే దానికి మూఢం అనే పేరు పెట్టి శుభ కార్యాలకు దూరంగా ఉండమని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే అన్ని గ్రహాలకు ఈ పరిస్థితి వస్తున్నప్పటికీ ప్రధానంగా శుభ గ్రహాలైన గురువు, శుక్రునకు శక్తి హీనత మాత్రమే దోషంగా పరిగణిస్తుంది జ్యోతిష్య శాస్త్రం. గురు, శుక్రులు సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి శుభ కార్యాలు చేయకూడదు అని చెబుతారు. ఏ శుభ కార్యక్రమానికైనా గురు శుక్రులు బాగుండాలని, శక్తివంతంగా ఉంటే శుభం జరుగుతుందని విశ్వసిస్తారు. మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేసినా అశుభం జరుగుతుందని. కష్టం కలుగుతుందని, నష్టం వాటిల్లుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. శుక్రమౌఢ్యమి కాలంలో ప్రకృతి సంపద క్షీణిస్తుంది. సముద్రం. ఆటు, పోటులలో మార్పులు వస్తాయి. శుక్రగ్రహ పాలిత ద్వీపాలకు, ప్రదేశాలకు భూకంప ప్రమాదాలు పొంచి ఉంటాయి. స్త్రీల మీద అత్యధికంగా అత్యాచారాలు జరిగే అవకాశాలుంటాయి. శుక్రుడు సంసార జీవితానికి, శృంగార జీవితానికి కారకుడు జాతకంలో శుక్రుడు బల హీనంగా ఉంటే సంసారజీవితం సజావుగా సాగదు. ఇలాంటి వారు ఇంద్రాణీ దేవి స్తోత్రం పారాయణం చేయాలి.
1 అన్నప్రాసన చేసుకోవచ్చు. 2 ప్రయాణాలు చేయవచ్చు. 3 ఇంటి మరమ్మత్తులు చేసుకోవచ్చు. 4 భూములు కొనుగోలు, అమ్మకాలు, అగ్రిమెంట్లు చేసుకోవచ్చు. 5 నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు. విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళవచ్చు. 6 నూతన వాహనాలు, వస్త్రాలు కొనవచ్చు. 7 జాతకర్మ,, జాతకం రాయించుకోవడం, నవగ్రహ శాంతులు, జప, హోమాది శాంతులు, గండనక్షత్ర శాంతులు ఉత్సవాలు చేయవచ్చు. 7 సీమంతం, నామకరణం, అన్నప్రాసనాది కార్యక్రమాలు చేయవచ్చు. గర్భిని స్త్రీలు, బాలింతలు తప్పనిసరి పరిస్థితితులలో ప్రయాణం చేయాల్సి వస్తే శుభ తిథులలో అశ్విని, దేవతి నక్షత్రాలలో శుభ హోరలో భర్తతో కలిసి ప్రయాణం చేస్తే శుక్రదోషం వర్తించదని శాస్త్రం సూచిస్తుంది.
1 వివాహాది శుభ కార్యాలు జరుపకూడదు. 2 లగ్నపత్రిక రాసుకోకూడదు. వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోరారు. 3 పుట్టు వెంట్రుకలు తీయించరాదు. 4 గృహ శంకుస్థాపనలు చేయ రాదు. 5 ఇల్లు మారకూడదు. 6 ఉపనయనం చేయకూడదు. 7 యజ్ఞాలు, మంత్రానుష్టానం, విగ్రహా ప్రతిష్టలు, ప్రతాలు చేయకూడదు. 8 నూతన వధువు ప్రవేశం, నూతన వాహనం కొనుట పనికిరాదు. 9 బవులు, బోరింగులు, చెరువులు తవ్వించకూడదు 10 వేదావిధ్యా ఆరంభం, చెవులు కుట్టించుట. నూతన వ్యాపార ఆరంభాలు మొదలగునవి చేయకూడదు.
1 ) మేష రాశి :- ఓం హ్రీం శ్రీం లక్ష్మీనారాయణాయ నమః 2 ) వృషభరాశి :- ఓం గోపాలాయ ఉత్తర ధ్వజాయనమః 3) మిథున రాశి :- ఓం క్లీం కృష్ణాయ నమః 4) కర్కాటక రాశి :- ఓం క్లీం హిరణ్యగర్భాయ అవ్యక్త రూపిణే నమః 5) సింహరాశి :- ఓం క్లీం బ్రహ్మణే జగదాధారాయ నమః 6) కన్యారాశి :- ఓం నమో హ్రీం పీతాంబరాయ నమః 7) తులారాశి :- ఓం తత్వ నిరంజనాయ తారకారామాయ నమః 8.వృశ్చికరాశి :- ఓం నారాయణాయ నరసింహాయ నమః 9) ధనూరాశి :- ఓం శ్రీం దేవకృష్ణాయ ఊర్ధ్వదంతాయ నమః 10 ) మకరరాశి :- ఓం శ్రీ వత్సలాయ నమః 11 ) కుంభరాశి :- ఓం శ్రీం ఉపేంద్రాయ అచ్యుతాయ నమః 12 ) మీనరాశి :- ఓం క్లీం ఉధృతాయ ఉద్దారిణే నమః
మేషరాశి: రామేశ్వరం : శ్లోకం:- సుతామ్ర పర్ణీ జలరాశి యోగే, నిబధ్య సేతుం విశిఖైర సంఖై్య శ్రీరామ చంద్రేన సమర్పితం తం, రామేశ్వరాఖ్యం నియతం నమామి. ఈ రాశి కుజునికి స్వగృహం, చర రాశి వారికి పదకండవ ఇంటి అధిపతి అయిన శని బాధకుడు. గ్రహ పీడా నివారణార్థం రామేశ్వర తీర్థ యాత్ర,, పైన చెప్పిన శ్లోకం రోజు చదువుకొనుట చేయవలెను, శ్రీరామచంద్రుడు శని బాధ నివారణార్ధం ఈ లింగము ప్రతిష్టించెనని చెప్పబడినది. కుజునకు కందుల దానము, ఎర్ర వస్త్ర దానములు కుడా చేసిన మంచి ఫలితములు వచ్చును. వృషభ రాశి: సోమనాధ జ్యోతిర్లింగము శ్లోకం:- సౌ రాష్ట్ర దేశే విదేశే తిరమ్యే జ్యోతిర్మయం చంద్ద్ర కళావ సంతం,భక్తి ప్రాధానాయ క్రుపావతీర్ణం తం సోమనాధం శరణం ప్రపద్యే. ఈ రాశి శుక్రునికి స్వగృహం, చంద్రునికి ఉచ్చ రాశి. సోమనాధ జ్యోతిర్లింగం శ్రీ క్రిష్ణుడుచే స్తాపించ బడింది. ఈ రాశికి శని నవామాదిపత్య బాధకుడు అయినందున శని దోషాలకు సోమనాధ దేవాలయ దర్శనం, పై శ్లోక ధ్యానము చేసిన సుభ ప్రదము. జన్మ నక్షత్రమందు రుదభ్రిషేకం చేయించుట వలన మంచి ఫలితములు పొందగలరు. బొబ్బర్ల దానము, బియ్యము దానము చేసిన మంచిది. మిధున రాశి: నాగేశ్వర జ్యోతిర్లింగం: శ్లోకం:-యామ్యే సదంగే నగరే తిరమ్యే విభ్శితాంగం వివిధైశ్చ భొగై , సద్భక్తి ముక్తి ప్రదమేకం, శ్రీ నగనాధం శరణం ప్రపద్యే. ఈ రాశి బుధునికి స్వగృహము. దోషాలకు నాగేశ్వర పుణ్య క్షేత్ర దర్శన, ప్రతి రోజు పై శ్లోకమును చదువుట, ఈ రాశి శని సంచరించు కాలమునందు జన్మ నక్షత్ర రోజున కైలాస యంత్ర ప్రస్తార మహా లింగార్చన జరిపించిన విశేషమైన ఫలితములు కలుగును. కర్కాటకం: ఓంకార జ్యోతిర్లింగం: శ్లోకం:-కావేరికా నర్మదాయో పవిత్రే , సమాగమే సజ్జన తారణాయ, సదైవమాన్దాత్రు పురే వసంతం, ఓం కారమీశం శివమే మీడే ఈ రాశి చంద్రునకు స్వగృహం , . ఓంకార జ్యోతిర్లింగ దర్శనం, రోజు పై శ్లోకం చదువుట , జన్మ నక్షత్రం రోజున ఓంకార బీజాక్షరం ఉచ్ఛరిస్తూ ఉండటం మంచి నివారణ ఉపాయములు. సింహరాశి : శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం శ్లోకం:-ఇలాపురే రమ్య విశాల కేస్మిన్ సముల్ల సంతం చ జగద్వ రేణ్యం, వందే మహా దారాతర స్వభావం, ఘ్రుశ్నేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే. సింహరాశి సూర్యునకు స్వగృహం. ఘ్రుష్నేస్వర జ్యోతిర్లింగ దర్శనం, పై శ్లోకమును రోజు చదువుట, జన్మ నక్షత్రం నాడు ఏక దశ రుదభ్రిషేకం ద్వారా దోషాలనుండి విముక్తి పొందవచ్చును. కన్యా రాశి: శ్రీ శైల జ్యోతిర్లింగం శ్లోకం:-శ్రీ శైల శ్రుంగే విభుధాతి సంగే తులాద్రి తుంగే పి ముదావసంతం, తమర్జునం మల్లిక పూర్వమేకం, నమామి సంసార సముద్ర సేతుం. ఈ రాశికి అధిపతి బుధుడు. బాధల నుండి ఉపశమనం పొందుటకు శ్రీ శైల మల్లిఖార్జున దర్శనం, భ్రమరాంబకి కుంకుమ అర్చన, జన్మ నక్షత్రం రోజున చండి హోమం చేసిన ఉపశమనం పొందగలరు. రోజు పైన చెప్పిన శ్లోకం చదువుట, జన్మ నక్షత్రం రోజున ఆవుకి ఆకు కూరలు, పచ్చ పెసలు తినిపించుట మంచిది. తులారాశి: మహాకాళేశ్వరం శ్లోకం:- అవన్తికాయాం విహితావరం, ముక్తి ప్రధానాయ చ సజ్జనానాం అకాల మౄఎత్యో : పరిరక్ష ణా ర్థం వందే మహాకాల మహాసురేశం ఈ రాశికి శుక్రుడు అధిపతి, మహాకాళేశ్వర దర్శనము ద్వారా, , శుక్రవారము సూర్యోదయ సమయములో బొబ్బర్లు దానం చేయుట ద్వారా దోషములు, బాధలనుండి విముక్తి పొందవచ్చును. వృశ్చిక రాశి: వైద్యనాదేశ్వరుడు శ్లోకం:-పూర్వోత్తరె ప్రజ్వాలికానిధానే , సాదావసంతం గిరిజాసమేతం , నురాసురారాదిత పాదపద్మం, శ్రీ వైద్య నాదం తమహం నమామి. ఈ రాశికి కుజుడు అధిపతి, వృశ్చికం వైద్య వృత్తికి, శస్త్ర చికిత్సలకి కారణ భూతం. బాధలకు వైద్య నాదేశ్వరుని దర్శించి , పూజించుట ద్వారా, మంగళవారము జన్మ నక్షత్రము రోజున కందులు, ఎరన్రి వస్త్రములు దానము చేయుట మంచిది. ఋతు క్రమ దోషములున్న స్త్రీలు పెద్ద ముత్తైదువులకు యెరన్రి వస్త్రములు దానము చేయుట మంచిది. ధనురాశి : విశ్వేశ్వర లింగం శ్లోకం:- సానంద వనే వసంతం, ఆనందకందం హత పాప బృందం వారణాసీనాధ మనాద నాదం, శ్రీ విశ్వ నాదం శరణం ప్రపద్యే. ఈ రాశి వారికి గురుడు అధిపతి, స్వస్తానం. వేదాంత ధోరణి విపరీత ఆలోచనలు, సైంటిఫిక్ ఆలోచనలు, వీరి లక్షణం. అద్దిశంకరుల వారికి మోక్షం ప్రసాదించిన కాశీ క్షేత్రం, , అన్నపూర్ణ వద్ద శివుడు భిక్ష అడుగుట, అర్ధరాత్రి గంగకి ఆవలి ఒడ్డున నారాయణ మంత్రంతొ శివుడు జీవులకి మోక్షము ప్రసాదిస్తాడని పురాణాలలో చెప్పబడింది. పై శ్లోక పారాయణ, పూజ చేయుట, కాశి క్షేత్ర దర్శనము , గురువారము రోజున, జన్మ నక్షత్రము రోజున శనగల దానము ఇచ్చుట ద్వారా శని, గురు గ్రహ దోషాల నుండి విముక్తి పొందవచ్చును. మకరము: భీమ శంకరం శ్లోకం:- యం డాకినీ శాకినికాసమాజై : నిషేవ్యమాణం పిశితా శనైశ్చ , సదైవ భీమాది పద ప్రసిధం, తం శంకరం భూత హితం నమామి. ఈ రాశి అధిపతి శని. గురునికి నీచ, కుజునికి ఉచ్చ,గురుడు అంటే జీవుడు , అహంకారపూరితమైన గజరాజు మొసలిచే పీడించబడి గజేంద్ర మోక్షము అనే ఆర్తి పూరితమైన ఘట్టం పురాణాలలో చెప్పబడింది. దోషాలకి భీమ శంకరం దర్శనం,,పూజ చేయుట, పై శ్లోక పారాయణము నిత్య పారాయణము, శని వారము నల్ల నువ్వుల దానము, నల్లని వస్త్రాలు దానము ఇచ్చుట, అవిటివారికి, ముసలి వారికి వస్త్ర దానము చేయుట మంచిది కుంభం:కేదారేశ్వరుడు శ్లోకం:-మహాద్రి పార్శే్వ చ రమంతం, సంపూజ్య మానం సతతం మునీన్రై్ద : సురాసురై ర్యక్ష మహోర గాదై్య : కేదారమీశం శివమేక మీడే . ఈ రాశికి శని అధిపతి, దోషాలకి కేదాద్రేశ్వర దర్శనము, పూజించుట, నిత్యమూ పై శ్లోక పారాయణము, శని వారము నువ్వుల దానము, అభిషేకం, మహన్యాస పూర్వక రుద్రాభి షేకం చేసిన మంచిది. మీన రాశి: త్రయంబకేశ్వరుడు శ్లోకం:-సహ్యాద్రి శీర్షే విమలే వసంతం, గోదావరీ తీర పవిత్ర దేశే, యద్దర్శనాథ్ పాతక మాశు నాశం, , ప్రయాతి తం త్రయంబక మీశ మీడే . ఈ రాశి అధిపతి గురుడు. త్రయంబకేశ్వరుడు ఎప్పుడు నీటి మధ్యలో ఉంటాడు. అధిక ఫలితాలని ఇస్తాడని పురాణ ప్రసిద్ది. దోషాలకు త్రయంబకేశ్వర దర్శనము, చిత్రపటము పూజ మందిరమునందు ఉంచి నిత్యమూ పై శ్లోకము పారాయణము చేయుట మంచిది.
శివ ఆరాధనలలో అత్యంత క్లిష్టమైనది, ప్రత్యక్ష ఫలదాయకమైనది ఈ పాశుపత మంత్రము. పూర్వ కాలములో అర్జునునికి కృష్ణుని ద్వారా ఈ పాశుపత మంత్ర విధానము బోధించబడినది. అర్జునుడు దీని ద్వారా శతృంజయమైన పాశుపతాస్త్రాన్ని పొందాడు. పాశుపతము రుద్ర సంపుటి ద్వారా చేయవలయును. రుద్రమునందలి 169 మంత్రములతో మనకు కావలసిన మంత్రమును సంపుటీకరించి శివునికి అభిషేకం చేయాలి. సత్వరమే కోరికలు సాధించటానికి సులభమైన ప్రక్రియ మంచి ఫలితాలు ఇస్తుంది నమ్మకం తో చేయాలి 1. మహాపాశుపతము: రాజ్యాధికారము ఎట్టి కార్యమైననూ శీఘ్రముగా అగుటకు 2. మహాపాశుపతాస్త్ర మంత్రము: సర్వ కార్య సిద్ధి, వాంఛితార్థ ఫలదాయిని. 3. త్రిశూల పాశుపతము: అపమృత్యుహరము. 4. అఘోర పాశుపతము: అపమృత్యుహరం. 5. నవగ్రహ పాశుపతము: నవగ్రహ పీడా పరిహారము. జాతకంలోని గ్రహదోష నివృత్తికి, గోచార గ్రహదోష నివృత్తికి 6. 6.కౌబేర పాశుపతము : ఐశ్వర్యాభివృద్ధి. ఆర్థిక లాభములు. 7. మన్యు పాశుపతము: ఈ పాశుపతము వలన శతృబాధానివారణమగును. 8. కన్యా పాశుపతము: ఈ మంత్రము వలన ఇష్టకన్యాప్రాప్తి, వివాహము కాని పురుషులకు తొందరగా వివాహం అవటం ఫలములుగా చెప్పబడ్డాయి. 9. వర పాశుపతము: ఇష్ట వర ప్రాప్తి, వివాహం కాని కన్యలకు శీఘ్రముగా వివాహం అవటం ఫలములుగా చెప్పబడ్డాయి. 10. బుణ విమోచన పాశుపతం : బుణ బాధనుంచి విముక్తి 11. సంతాన పాశుపతము : సంతాన ప్రాప్తి. 12. ఇంద్రాక్షీ పాశుపతము: : నిరంతరము అనారోగ్యములు, జ్వరములతో బాధ అన్ని రకాల అనారోగ్యములు 13. వర్ష పాశుపతము: సకాల వర్ష ప్రాప్తి, కరువు కాటకముల నివారణ 14. అమృత పాశుపతము: అపమృత్యు హరము. సకల ఐశ్వర్య ప్రదము